నీటికుంటలో పడి అక్కా, చెల్లెలు మృతి
NEWS Sep 20,2026 09:46 pm
ములుగు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ములుగు మండలం ఖాసిందేవపేట గ్రామంలో ఆదివారం నీటి కుంటలో పడి అక్కా చెల్లెలు మృతి చెందారు.గ్రామానికి చెందిన అహ్మద్ పాషా తన కుటుంబ సభ్యులతో కలిసి పత్తి చేను వద్దకు వెళ్లారు. తండ్రి వెంట వెళ్లిన సౌమ్యాన్(19), ఆసియా(10) ఇద్దరు చేను పక్కనే ఉన్న కుంట వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడ్డారు. ఆలస్యంగా గమనించిన తల్లిదండ్రులు అక్కడికి వెళ్లి చూసేసరికి ఆ కుంటలో మృతి చెంది ఉన్నారు. ఇద్దరు కుమార్తెల మృతితో ఆ కుటుంబంలో విషాదఛయాలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.