నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి
NEWS Sep 19,2026 07:38 pm
అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి మంత్రి పొంగులేటిని కోరారు. హైదరాబాదులో సిపిఐ జాతీయ నేత చాడ వెంకట్ రెడ్డితో పాటు పలువురు నాయకులు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వరంగల్ నగరంలోని అర్హులైన నిరుపేదలకు ఇండ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇండ్లు కేటాయించి వారికి అండగా నిలవాలని వినతిపత్రం అందజేశారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు.