గురుకులాల ప్రొవిజన్స్ రద్దు చేయాలి
NEWS Sep 19,2026 07:37 pm
గురుకులాల్లో ప్రొవిజన్స్ సరుకులకు అధిక ధరలు నిర్ణయించడంతో కాంట్రాక్టర్లు,చిన్న పరిశ్రమలు ఉపాధి కోల్పోతున్నాయని మైనార్టీ కాంట్రాక్టర్ జేఏసీ చైర్మన్ మంద శ్యామ్ ఆరోపించారు. వరంగల్ ప్రెస్ క్లబ్ లో మైనార్టీ కాంట్రాక్ట్ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా శ్యామ్ మాట్లాడుతూ గురుకులాల్లో ప్రొవిజన్స్ కు సరుకుల సరఫరాకు ఎన్ఎసిఓఎఫ్ సంస్థకు ఇచ్చిన స్టేట్ వైస్ టెండర్ ను రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో బీసీ,ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.