అక్కసుతోనే కాంగ్రెస్‌పై ఆరోపణలు: కడియం
NEWS Sep 19,2026 04:27 pm
రఘునాథపల్లి మండల కేంద్రంలో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అధికారం కోల్పోయామనే అక్కసుతోనే బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని కడియం విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం ఎవరూ ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. నియోజకవర్గంలోని అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే తన లక్ష్యమని తెలిపారు. రానున్న రోజుల్లో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు