నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
NEWS Sep 19,2026 04:26 pm
మెట్‌పల్లిలో ఈ నెల 23, 24న నిర్వహించే వినాయక నిమజ్జన వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి వట్టివాగు వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. శోభాయాత్రలు, నిమజ్జన కార్యక్రమాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. విద్యుత్, వైద్య, అగ్నిమాపక సేవలతో పాటు క్రేన్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.