₹2 వేలు దాటితే UPI చెల్లింపులు తీసుకోం
NEWS Sep 19,2026 02:55 pm
అక్టోబర్ 15 నుంచి ₹2 వేలకు మించిన ఇంధన UPI లావాదేవీలపై 0.4% MDR వసూలు చేయాలన్న NPCI నిర్ణయంపై పెట్రోల్ బంక్ డీలర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. లీటరుపై తమకు లభించే కమిషన్ ₹2.40 నుంచి ₹3.40 మాత్రమేనని, MDRభారం తమపై పడుతుందని అన్నారు. పెట్రోల్ బంక్‌లకు MDR నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే అక్టోబర్ 15 నుంచి ₹2 వేలకు పైబడిన ఇంధన కొనుగోళ్లకు UPI చెల్లింపులు నిలిపివేసి, నగదు మాత్రమే స్వీకరిస్తామని హెచ్చరించారు.