చెరువుల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి
NEWS Sep 18,2026 09:25 pm
చెరువులు, నాళాల పరిరక్షణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హనుమకొండ జిల్లా పరిధిలోని చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణ సంబంధించి వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లా పరిధిలోని చెరువులు, కుంటలు, నాళాల పరిరక్షణకు నోటిఫై చేయాలన్నారు. ఈ ప్రక్రియను సంబంధిత అధికారులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు.