త్రినేత్ర టీ బంక్‌ను సందర్శించిన ఎమ్మెల్యే
NEWS Sep 18,2026 09:23 pm
ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మదన్‌మోహన్ తన తండ్రి కొండయ్య, రిటైర్డ్ హెచ్‌ఎం రాజేశ్వర్‌రావు, స్నేహితులతో కలిసి జీఆర్ కాలనీలోని త్రినేత్ర టీ బంక్ అండ్ టిఫిన్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌మోహన్ కాఫీ తాగారు. నాణ్యమైన పాలతో రుచికరమైన టీ, కాఫీ అందించడంతో పాటు ప్రత్యేక పూరి, సాయంత్రం స్నాక్స్‌గా మిర్చి పకోడీ, ఎగ్ బజ్జి వంటి పదార్థాలను అందుబాటులో ఉంచిన నిర్వాహకులు మామిండ్ల రాజు, పాలరాజును ఎమ్మెల్యే అభినందించారు. త్రినేత్ర టీ బంక్‌లో టీ, కాఫీ రుచిగా ఉంటాయని కొండయ్య, రాజేశ్వర్‌రావు తెలిపారు.