HYD: అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దానం నాగేందర్ స్పందించారు. కోర్టు తీర్పు అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా.. సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదు. ప్రజా క్షేత్రంలో, ఎన్నికల్లోనే కొట్లాడుతాం. ఎన్నికల్లో పోరాడటం నాకు కొత్త కాదు. పోరాటాలు చేసే ఈ స్థాయికి వచ్చా. ఎన్నికలు వస్తే.. ప్రజా క్షేత్రంలో పోరాడుతా.. విజయం సాధిస్తా’’ అని దానం తెలిపారు.