లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
NEWS Sep 17,2026 11:06 pm
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కారు నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.