ఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన 3వ టీ20 మ్యాచ్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ చారిత్రక ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. ఆఫ్ఘన్ బౌలర్లను ఊచకోత కోస్తూ, కేవలం 30 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన క్రికెటర్‌గా సరికొత్త రికార్డు సృష్టించాడు. 2017లో శ్రీలంకపై ఇండోర్ వేదికగా రోహిత్ 35 బంతుల్లో సాధించిన సెంచరీ రికార్డును అభిషేక్ తాజాగా బద్దలు కొట్టాడు. సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించి స్టేడియంలోని ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు.