తొలి ప్రపంచ నేతగా మోదీ ఘనత!
NEWS Sep 17,2026 12:26 pm
ప్రధాని మోదీ జన్మదినం సందర్బంగా సోషల్ మీడియాలో విషెస్‌ల సందడి మొదలైంది. సోషల్ మీడియా వేదికల్లో భారీ ఫాలోయింగ్‌తో ప్రపంచ నేతల్లో మోదీ ప్రత్యేకంగా నిలుస్తున్నారు. 2026 సెప్టెంబర్ నాటికి Xలో 100 మిలియన్లకు పైగా, ఇన్‌స్టాలో 106 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. యూట్యూబ్ ఛానల్ 30 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు దాటారు. జన్‌జీని చేరుకునేందుకు మోదీ రీల్స్, షార్ట్ వీడియోలు, ఫొటోలు, ట్రెండింగ్ అంశాలను వినియోగిస్తున్నారు. ప్రభుత్వ సమాచారంతో పాటు యువతతో డిజిటల్ మమేకానికి సోషల్ మీడియా కీలక వేదికగా మారింది.