విచారణ ప్రక్రియ వేగవంతం చేయాలి
NEWS Sep 15,2026 10:36 pm
SIR ప్రక్రియలో భాగంగా హనుమకొండ న్యూరాయపురలోని 78వ పోలింగ్ కేంద్రంలో నోమ్యాపింగ్, అనామాలీస్ జాబితాలోని ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన విచారణ కేంద్రంలో కొనసాగుతున్న విచారణ ప్రక్రియను జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి పరిశీలించారు. ఈ సందర్భంగా అనామాలీస్, మ్యాపింగ్ కాని ఓటర్ల వివరాలు, నోటీసుల జారీ, ఇప్పటి వరకూ ఎంతమంది ఓటర్లు ధ్రువ పత్రాలు సమర్పించారు, ఎన్ని విచారణ చేశారు, ఇంకా ఎన్ని చేయాల్సి ఉందనే వివరాలను ఏఈఆర్వోలు, బీఎల్వోలను అదనపు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.