అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
NEWS Sep 15,2026 10:37 pm
కుడా పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు వేగవంతం కావాలని కుడా చైర్ పర్సన్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్, కుడా వైస్ చైర్ పర్సన్ చాహత్ బాజ్ పాయి అన్నారు. కుడా కార్యాలయంలో అభివృద్ధి పనుల పురోగతి మీద సంబంధిత అధికారులతో కుడా చైర్ పర్సన్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్, కుడా వైస్ చైర్ పర్సన్ చాహత్ బాజ్ పాయి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కుడా పరిధిలో చేపట్టిన వరంగల్ బస్ స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్, వేయి స్తంభాల గుడి అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.