విద్యారంగాన్ని బలోపేతం చేయాలి
NEWS Sep 15,2026 10:36 pm
జనగామ: కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, పురోగతిపై జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ (దిశా) కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు, జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ (దిశా) కమిటీ ఛైర్పర్సన్ కడియం కావ్య హాజరయ్యారు. విద్యా శాఖకు సంబంధించి జిల్లాలో 15 పీఎం శ్రీ పాఠశాలలు, 5 మోడల్ పాఠశాలలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. పనులు త్వరగా పూర్తి చేయాలని ఎంపీ కావ్య ఆదేశించారు.