నయనతార ప్రధానపాత్రలో రానున్న చిత్రం ‘మూకుత్తి అమ్మన్ 2’ తెలుగులో ‘మహాశక్తి’. సీనియర్ దర్శకుడు సుందర్.సి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని టీజర్‌ను విడుదల చేశారు. అమ్మవారి పాత్రలో నయనతార గూస్‌బంప్స్ తెప్పిస్తున్నారు. ఇందులో సునీల్, రెజీనా, దునియా విజయ్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.