భారత్-చైనా ఒక్కటైతే ప్రపంచం వినాల్సిందే..
NEWS Sep 12,2026 12:19 pm
భారత్, చైనా ఒకే గొంతుతో మాట్లాడితే ప్రపంచం తప్పకుండా వినాల్సిందేనని ‘అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్’ చైనా ఫెలో అంటారా ఘోషల్ సింగ్ అన్నారు. 2 ఆసియా దిగ్గజాల మధ్య సహకారం పెరిగితే దాని ప్రభావం ఇరు దేశాలకే పరిమితం కాకుండా ప్రపంచ శాంతి, ఆర్థిక స్థిరత్వంపైనా ఉంటుందని పేర్కొన్నారు. బ్రిక్స్ సదస్సు కోసం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఢిల్లీకి రానుండటం, ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక భేటీకి సిద్ధమవడం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మూడేళ్లలో మోదీ–జిన్‌పింగ్ మూడోసారి సమావేశం కానున్నారు. కజాన్, టియాంజిన్ భేటీల తర్వాత ఢిల్లీలో జరగనున్న సమావేశం భారత్–చైనా సంబంధాల్లో కొత్త మలుపుకు సంకేతమని ఘోషల్ సింగ్ పేర్కొన్నారు.