ఇరాన్ అధ్యక్షుడి చేయి పట్టుకున్న మోదీ!
NEWS Sep 12,2026 10:42 am
బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ వేదికగా ప్రధాని మోదీ, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ చేయి పట్టుకుని నడుస్తున్న దృశ్యం హాట్ టాపిక్ అవుతోంది. వారి వెంటే రష్యా అధ్యక్షుడు పుతిన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాఫోసా కూడా నడిచారు. ఈ ఫొటో ఇరాన్, రష్యా వంటి దేశాలతో సంబంధాలు కొనసాగిస్తూనే, పాశ్చాత్య దేశాలతో చర్చలకు ద్వారాలు తెరిచి ఉంచే భారత సమతుల్య దౌత్య వ్యూహానికి అద్దం పడుతోందని అంటున్నారు. సెప్టెంబర్ 11న న్యూఢిల్లీలో ఈ సంఘటన చోటుచేసుకుంది.