ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
NEWS Sep 12,2026 11:01 pm
ప్రజలకు మెరుగైన పోలీసింగ్ సేవలు అందించాలని వరంగల్ సీపీ శ్వేత సిబ్బందికి సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. సిబ్బందిని శాఖపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌లోని వివిధ రికార్డులను పరిశీలించారు. ట్రాఫిక్ పోలీసుల విధుల నిర్వహణ, వాహనాల తనిఖీలు, ట్రాఫిక్ నిబంధనల అమలు, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.