ఏడేళ్ల తరువాత భారత్‌కు చైనా అధినేత
NEWS Sep 11,2026 04:57 pm
ఏడేళ్ల తరువాత భారత్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రాబోతున్నారు. రేపు, ఎల్లుండి (ఆదివారం, సోమవారం) జరగబోయే బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనబోతున్నారు. 2019లో భారత్-చైనా సరిహద్దుల్లో చోటుచేసుకున్న గల్వాన్ ఘర్షణల అనంతరం చైనా అధినేత భారత్‌కు రావడమిదే తొలిసారి. బ్రిక్స్ సదస్సులో భాగంగా ఇరు దేశాలకు సంబంధించిన ప్రత్యేక చర్చలో ప్రధాని మోదీ, జిన్‌పింగ్ పాల్గొననున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య మైత్రి బలపడనుందని, వాణిజ్య సంబంధాలు మళ్లీ మెరుగవుతాయని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.