ఎక్సైజ్ అధికారులకు సన్మానం
NEWS Sep 11,2026 05:03 pm
కామారెడ్డి ఎక్సైజ్ సీఐ పోశెట్టి, ఎస్‌ఐలు శ్రీనివాస్, విజయ్ సిద్ధార్థ, కిరణ్‌లను MRPS రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్. భాగయ్య, అంబేద్కర్ సంఘం కామారెడ్డి జిల్లా కన్వీనర్ పి. శివరాజు కలిసి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని విధి నిర్వహణలో ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులను కోరారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మరింత సమర్థంగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.