తెలంగాణ ఓపెన్ స్కూల్ లో ప్రవేశాలకు ఈనెల 15వ తేదీతో గడువు ముగియనుంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద దేవి సూచించారు. ఇందుకు సంబంధించిన అవగాహన పోస్టర్ ను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. విద్యకు మధ్యలో దూరమైన వారు ఓపెన్ స్కూల్ ద్వారా విద్యను కొనసాగించి 10వ తరగతి, ఇంటర్ పూర్తి చేయవచ్చన్నారు. పూర్తి వివరాలకు telanganaopenschool.org.in వెబ్సైట్ లో చూడాలన్నారు. అభ్యర్థులు నిర్ణిత గడువులోగా అడ్మిషన్లు పొందాలని సూచించారు.