విద్యార్థుల అభ్యసన స్థాయిని పరిశీలించిన ఎంఈఓ
NEWS Sep 10,2026 10:39 am
మేడిపల్లి: మండలంలోని వల్లంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఎంపీపీఎస్ పాఠశాలను ఎంఈఓ లక్ష్మీనరసయ్య గురువారం సందర్శించారు. FLNలో భాగంగా విద్యార్థులతో స్పాట్ అసెస్మెంట్ నిర్వహించి, వారి అభ్యసన స్థాయిని పరిశీలించారు. విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రతి విద్యార్థి కనీస అభ్యసన సామర్థ్యాలను సాధించేలా బోధన చేపట్టాలని తెలిపారు.