AIతో మానవాళికి ముప్పు అంటూ రాజీనామా!
NEWS Sep 10,2026 09:24 am
ఏఐ రంగంలోని అగ్రగామి సంస్థలు మానవ ప్రాణాలతో జూదం ఆడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ పరిశోధకుడు జాకబ్ కాక్సన్ రాజీనామా చేశారు. ఓపెన్ఏఐలో మూడేళ్లు ప్రీట్రైనింగ్ రీసెర్చ్ విభాగంలో పనిచేసిన ఆయన అనంతరం ఆంత్రోపిక్‌లో చేరారు. ఇటీవల ‘X’లో రాజీనామా ప్రకటించిన కాక్సన్.. స్వీయ అభివృద్ధి చేసుకునే సూపర్ ఇంటెలిజెన్స్ కోసం AI సంస్థలు పోటీ పడుతున్నాయని ఆరోపించారు. ఈ దశాబ్దం ముగిసేలోగా AI మానవాళిని నాశనం చేసే స్థాయికి చేరుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కోట్ల రూపాయల విలువైన కంపెనీ ఈక్విటీని సైతం వదులుకున్న ఆయన నిర్ణయం, ఏఐ భద్రతపై ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న చర్చను మరోసారి తీవ్రతరం చేసింది.