రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి
NEWS Sep 10,2026 09:25 am
రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. ఎన్నికల అబ్జర్వర్ గా అదనపు కలెక్టర్ వైవి.గణేష్, ఎన్నికల అధికారిగా డిసిఓ నీరజను ఆమె నియమించారు. సెప్టెంబర్ 19 తుది ఓటర్ల జాబితా, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. కాగా అక్టోబర్ 4న పోలింగ్ జరగనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు ఉన్నారు.