ప్రభుత్వ భూమిని పరిరక్షించాలి. జిల్లా కలెక్టర్ కు బర్మాకాంది సికులు వినతి
NEWS Sep 07,2026 08:43 pm
నగరంలోని విలువైన 3 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి కాపాడాలని నిరుపేద కాందిశీకుల పోరాట ఐక్య వేదిక నాయకులు కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం ఐక్యవేదిక అధ్యక్షుడు ఏ. నరసింహులు, కార్యదర్శి హెచ్. దీపక్ జనరల్, మహిళా నాయకురాలు సత్యవాణి మీడియాతో మాట్లాడుతూ విశాఖ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భూముల విలువ భారీగా పెరిగిందన్నారు. ఇదే విషయమై విశాఖ జిల్లా కలెక్టర్ కు పలుమార్లు ఫిర్యాదు చేశామన్నారు.