పాత కలెక్టరేట్‌ను ‘క్యాన్సర్ హబ్’గా మార్చాలి
NEWS Sep 07,2026 08:40 pm
కరీంనగర్ : నగరంలోని పాత కలెక్టరేట్ భవనాన్ని ‘నార్త్ తెలంగాణ క్యాన్సర్ హబ్’గా మార్చాలని జనసేన నాయకురాలు డా. సాయి కృష్ణప్రియ కోరారు. ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడే క్యాన్సర్ వైద్యం అందించాలని, వెంటనే నిపుణుల కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.