రాత్రివేళ విద్యుత్ కోతలతో ప్రజల అవస్థలు
NEWS Sep 06,2026 10:47 pm
ఎమ్మిగనూరు: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో వరుసగా మూడో రోజు రాత్రివేళ విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ రాత్రి 9 గంటల నుంచి 10, 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు చీకట్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ కోతల సమయంలో దోమల బెడద ఎక్కువవడంతో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళే విద్యుత్ సరఫరా ఎందుకు నిలిపివేస్తున్నారో అధికారులు స్పష్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత్ కోతల సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.