హిమోఫిలియా పేషెంట్లకు ట్రీట్మెంట్ అందించాలి
NEWS Sep 06,2026 10:39 pm
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ నూతన భవనంలో హిమోఫిలియా పేషెంట్ల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయాలని హిమోఫిలియా సొసైటీ కార్యదర్శి సుమన్ కుమార్ కోరారు. హిమోఫిలియా సొసైటీ వరంగల్ చాప్టర్ ఆధ్వర్యంలో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ కుమార్ రెడ్డిని కలిసి పలు అంశాలతో కూడిన వినతి పత్రం అందజేశారు.నూతన భవనంలో హిమోఫిలియా పేషంట్ల కోసం ప్రత్యేక వార్డు ట్రీట్మెంట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.