మహేష్ కుమార్ గౌడ్‌కు కిసాన్ కాంగ్రెస్ జాతీయ కోఆర్డినేటర్ సన్మానం
NEWS Sep 06,2026 10:49 pm
హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తన పదవీకాలంలో రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం ఘనంగా సన్మానం జరిగింది. ఈ సందర్భంగా కిసాన్ కాంగ్రెస్ జాతీయ కోఆర్డినేటర్ నీలం రమేష్ మర్యాదపూర్వకంగా మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, రైతుల సమస్యల పరిష్కారానికి మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.