గుజరాత్‌లో తెలంగాణ మీడియా బృందం
NEWS Sep 06,2026 10:15 am
పీఐబీ హైదరాబాద్ ఆధ్వర్యంలో 10 మంది తెలం గాణ జర్నలిస్టుల బృందం గుజరాత్‌లో వారం రోజుల పర్యటన చేస్తోంది. సెప్టెంబర్ 12 వరకు జరిగే పర్యటనకు మీడియా కమ్యూనికేషన్ అధికారి వర్గంటి గాయత్రి నేతృత్వం వహిస్తున్నా రు. అహ్మదాబాద్ చేరుకున్న బృందానికి పీఐబీ అధికారులు స్వాగతం పలికారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించడం, రాష్ట్రాల మధ్య అభివృద్ధి అనుభవాలను పంచుకోవడం పర్యటన ఉద్దేశం.