వరంగల్ అభివృద్ధిపై సీఎం దృష్టి సారించారు
NEWS Sep 05,2026 10:17 pm
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండలోని 52వ డివిజన్ లో రూ.90 లక్షలతో చేపట్టిన అంతర్గత సిసి రోడ్ల పనులకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. వరంగల్ నగర అభివృద్ధిపై సీఎం రేవంత్ దృష్టి సారించారని చెప్పారు.