300 ఏళ్ల తర్వాత నిత్య జలాభిషేకం!
NEWS Sep 06,2026 06:30 am
ములుగు: వెంకటాపూర్ మండలంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో 300 ఏళ్ల తర్వాత పూర్తిస్థాయి నిత్య జలాభిషేకం పునఃప్రారంభమైంది. 17వ శతాబ్దంలో భూకంపంతో ఆలయ గర్భగుడి నుంచి నీరు బయటకు వెళ్లే సోమసూత్రం మూసుకుపోయింది. దీంతో రుద్రేశ్వరుడికి సంపూర్ణ అభిషేకాలు నిలిచిపోయాయి. తాజాగా శాస్త్రీయ పరిరక్షణ పద్ధతులతో పునరుద్ధరణ పనులు చేపట్టారు. 3డీ మ్యాపింగ్, ఎండోస్కోపిక్, గోప్రో కెమెరాలతో రియల్‌టైమ్ పర్యవేక్షణ చేస్తూ, ఆలయ నిర్మాణానికి ఎలాంటి నష్టం కలగకుండా సాఫ్ట్ డ్రిల్లింగ్ విధానంలో అడ్డంకులను తొలగించారు. దీంతో సోమసూత్రం పునరుద్ధరించబడి నిత్య జలాభిషేకం ప్రారంభమైంది.