విద్యుత్ షాక్‌తో చిన్నారి మృతి
NEWS Sep 05,2026 10:19 pm
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వీరభద్రనగర్‌లో తీవ్ర విషాదం. విద్యుత్ షాక్ తో ఓ బాలుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. వీరభద్రనగర్ కు చెందిన భానోత్ సంపత్ కుమారుడు రిషి(3) ఆడుకుంటూ వెళ్లి తమ ఇంటి ఆవరణలో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎర్తింగ్ వైర్ కు తగలడంతో ప్రమాదవశాత్తు అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.