కరీంనగర్: రేకుర్తి లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో ఎలుగుబంటి సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. గుట్టల్లోంచి వచ్చి సంచరిస్తుండగా జనం కేకలు వేయడంతో తిరిగి కొండపైకి పారిపోయింది. గతంలోనూ ఓ ఇంటి రేకులపైకి ఎక్కి కలకలం సృష్టించింది. తరచూ జనావాసాల్లోకి వస్తున్న ఎలుగుబంటిని బంధించి అటవీ ప్రాంతానికి తరలించాలని ప్రజలు కోరుతున్నారు.