కరీంనగర్: ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ మాల మహానాడు (చెన్నయ్య) చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నివాస ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో కరీంనగర్‌లోని ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోస్టర్ విధానం సవరించి, మాలలకు 7 శాతం రిజర్వేషన్లు, కార్పొరేషన్ కేటాయించకుంటే ఆందోళనలు ఉధృతం చేసి అసెంబ్లీని ముట్టడిస్తామని మాల మహానాడు నాయకులు హెచ్చరించారు.