ఉపాధ్యాయ వృత్తికి విశిష్ట గౌరవం తెచ్చిన వ్యక్తి సర్వేపల్లి
NEWS Sep 05,2026 10:17 pm
తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుందని కుడా చైర్మన్ గుండు సుధారాణి అన్నారు. వరంగల్ లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో సుధారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తికి విశిష్ట గౌరవం తీసుకువచ్చారని కొనియాడారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.