ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి
NEWS Sep 05,2026 10:17 pm
వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ సందర్శించారు. ముందుగా ఆలయానికి చేరుకున్న పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.అర్చకులు ఆ స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆయనకు అందజేశారు.అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని పోచంపల్లి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.