శ్రీచైతన్యలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
NEWS Sep 05,2026 09:04 pm
శ్రీ చైతన్య పాఠశాల కొత్తగూడెం-1లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ కల్యాణి మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. హైస్కూల్ కోఆర్డినేటర్ చెంచల బాబు, ప్రైమరీ కోఆర్డినేటర్ మాధవి మాట్లాడుతూ.. విద్యార్థుల విజయానికి గురువుల కృషి, ప్రోత్సాహం ముఖ్యమన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు.