KUDA చైర్మన్‌గా సుధారాణి బాధ్యతలు
NEWS Sep 05,2026 02:10 pm
హన్మకొండలోని కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KUDA) కార్యాలయంలో కుడా చైర్మన్‌గా గుండు సుధారాణి ప్రమాణ స్వీకారం చేసి అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి గుండు సుధారాణికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కడియం శ్రీహరి మాట్లాడుతూ.. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ మరింత ప్రగతిపథంలో పయనించే విధంగా, ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో మౌలిక సదుపాయాల కల్పన, పట్టణాభివృద్ధి పనులు వేగవంతం చేసే దిశగా కృషి చేయాలని సూచించారు.