ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
NEWS Sep 05,2026 04:54 am
నిర్మల్ పట్టణంలోని వాల్మీకి నగర్ కాలనీలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాఠశాల పూర్వ ప్రధానాచార్యులు అనురాధ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ చిన్ననాటి కృష్ణుడి అల్లరి చేష్టలు, లీలలు, ద్వాపర యుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. శ్రీకృష్ణుడు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. అనంతరం గోపిక, గోపాల వేషధారణలో విద్యార్థులు ఉట్టి కొట్టి సంబరాలు జరుపుకున్నారు. సహాయ ప్రధానాచార్యులు నరేష్, శ్రీకాంత్, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.