ఆచూకీ లేని 275 మంది భారతీయులు
NEWS Sep 04,2026 09:47 pm
నేపాల్ జలప్రళయంలో 275 మంది భారతీయుల ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. నేపాల్‌లో చిక్కుకుపోయిన 166 మందిని అక్కడి సిబ్బంది రక్షించినట్లు తెలిపింది. 1,907 మంది భారతీయులు చైనా నుంచి నేపాల్‌కు సురక్షితంగా చేరుకున్నారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జయస్‌వాల్ తెలిపారు. నేపాల్ వరదల్లో మరణించినవారి సంఖ్య 1,295కు చేరగా, సుమారు 5వేల మంది ఆచూకీ లభ్యం కాలేదు.