కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి
NEWS Sep 04,2026 09:51 pm
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆరోపించారు. హనుమకొండ జిల్లా కాజీపేటలోని పలు డివిజన్లలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు నెలకు రూ.2500, విద్యార్థినీలకు స్కూటీలు, తులం బంగారం ఇలా అనేక హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేంతవరకు తాము పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.