ప్రైవేట్ ఉపాధ్యాయులకు భద్రత కల్పించాలి
NEWS Sep 04,2026 09:51 pm
తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఉద్యోగ,ఆరోగ్య భద్రత కల్పించాలని బిఆర్ఎస్ రాష్ట్ర నేత ఎనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. హనుమకొండ నగరంలో నిర్వహించిన ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ గురువులు దైవంతో సమానమని పేర్కొన్నారు. సమాజం నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ప్రభుత్వం ప్రైవేటు ఉపాధ్యాయులకు ఆరోగ్య ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.