కృష్ణుడి రూపంలో భద్రకాళి అమ్మవారు
NEWS Sep 04,2026 09:50 pm
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు భద్రకాళి అమ్మవారిని కృష్ణుడి రూపంలో సుందరంగా అలంకరించారు. భక్తులు ఉదయం నుంచి పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అమ్మవారిని కృష్ణుడి అలంకరణలో చూసి భక్తులు మంత్రముగ్ధులవుతున్నారు.