జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా లక్ష్మయ్య
NEWS Sep 04,2026 04:18 pm
రాయికల్: మండలంలోని ఆలూర్ జడ్పీహెచ్‌ఎస్‌లో ఎస్‌ఏ ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మయ్య ప్రకటించిన ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ, ఆంగ్ల బోధనలో చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. లక్ష్మయ్య ఎంపిక పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.