ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా నూనావత్ రాజు
NEWS Sep 04,2026 06:59 pm
కోరుట్ల: SRSP క్యాంప్ గడి కల్లూరు రోడ్ ప్రాథమిక పాఠశాల నూనావత్ రాజు జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. విద్యార్థుల సంఖ్య పెంపు, పాఠశాల అభివృద్ధి, నాణ్యమైన విద్య అందించేందుకు చేసిన కృషికి ఈ గుర్తింపు లభించింది. ఆయన కృషితో పాఠశాలలో ప్రస్తుతం 365 మంది విద్యార్థులు చదువుతున్నారు. రాజు ఎంపిక పట్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాభిమానులు అభినందనలు తెలిపారు.