రాయికల్ మండలానికి 5 జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు
NEWS Sep 04,2026 06:58 pm
రాయికల్: జగిత్యాల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా రాయికల్ మండలానికి చెందిన ఐదుగురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. అల్లిపూర్ ZPHS హిందీ ఉపాధ్యాయుడు జె. వసంతరావు, ఇటిక్యాల ZPHS భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు గాజేంగి రాజేశం, రాజ్‌నగర్ MPPS ఎస్‌జీటీ గాజుల కిరణ్ కుమార్, FLNలో బెజ్జంకి హరికృష్ణ, ఆలూర్ ZPHS ఎస్‌ఏ ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు లక్ష్మయ్య అవార్డులకు ఎంపికయ్యారు. ఒకే మండలం నుంచి ఐదుగురు ఎంపిక కావడం పట్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.