కరీంనగర్: తీగలగుట్టపల్లి ఆర్‌ఓబీ నిర్మాణం 2028 వరకు సాగనుండటంతో కరీంనగర్-చొప్పదండి వాహనదారుల కష్టాలను గుర్తించి కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవ తీసుకున్నారు. రూ.28 లక్షల మున్సిపల్ నిధులతో ఆర్‌ఓబీ వద్ద యుద్ధప్రాతిపదికన తారు రోడ్డు నిర్మించారు. దీంతో తాత్కాలికంగా వాహనదారులకు రాకపోకల తిప్పలు తప్పి ఊరట లభించింది.