రైతు సమస్యలపై బీఆర్‌ఎస్ పోరుబాట
NEWS Sep 04,2026 06:59 pm
బూర్గంపాడు మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై నిరసన చేపట్టారు. మాజీ జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. రైతుబంధు, సన్న వడ్ల బోనస్, యూరియా, రైతుబీమా, నీటిపారుదల, విద్యుత్ సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.